ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎమ్డీసీ) డిజిటలైజేషన్ వైపు అడుగులు వేసింది. ఇందుకోసం ఉద్దేశించిన సాప్ ఆధారిత ఈఆర్పీ సిస్టంను సంస్థ కార్యకలాపాల్లో ఇంప్లిమెంట్ చేయనున్నట్లు సీఎండీ సుమిత్ దేవ్ ప్రకటించారు.
నూతన సిస్టం ద్వారా తీసిన తొలి డిజిటలైజేషన్ ఇన్ వాయిస్‌ను ఆయన మాసబ్‌ట్యాంక్‌లో ఆవిష్కరించారు. సహ భాగస్వామి ఆక్సెంచర్ ఈ నూతన ఈఆర్పీ సిస్టంను అభివృద్ధి చేసి నిర్వహణ కోసం మానిటర్ చేయనుంది. ఈ నూతన సిస్టం ద్వారా సంస్థ వర్క్ ఆర్డర్లు మొదలు.. బిల్లింగ్, ఇన్ వాయిస్, చెల్లింపులు, ప్లాంట్ మెయింటెనెన్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మెటీరియల్ మేనేజ్ మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, క్వాలిటీ మేనేజ్ మెంట్ అన్నీ డిజిటల్ మాధ్యమంలో ఎన్ఎమ్డీసీ నిర్వహించనుంది.