నిజాం చక్కెర కర్మాగారం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలివైన అవినీతి పరుడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా విమర్శించారు. తెదేపా, కాంగ్రెస్‌లు లాభాల్లో ఉన్న కర్మాగారాన్ని దోచుకుంటే తెరాస నష్టాల్లో ఉన్నా వదలట్లేదని హైదరాబాద్‌లో మండిపడ్డారు. అసలు చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం చంద్రబాబు చేసిన తప్పని... అందుకు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాడని విమర్శించారు. రైతులకు అండగా నిలిచేందుకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని అర్వింద్ తెలిపారు.
'కేసీఆర్ తెలివైన అవినీతి పరుడు' - నిజాం చక్కెర కర్మాగారం
నిజాం చక్కెర కర్మాగారం విషయంలో తెరాస వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కర్మాగారం ప్రైవేటీకరణ చేసిన ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు. కర్మాగారం లాభాల్లో ఉన్నప్పుడు తెదేపా, కాంగ్రెస్ పార్టీలు దోచుకున్నాయని ఆరోపించారు. రైతులకు అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ధర్మపురి అర్వింద్