నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. 2010లో నిజామాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో కోర్టుకు వచ్చారు. 2010 జులై 27న నిజామాబాద్ ఎస్పీ ఆఫీసు ఎదురుగా ధర్నా చేపట్టారు.
నాంపల్లి కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత - nampally court
హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. 2010లో నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో కోర్టుకు వచ్చారు. నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.
నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత
సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉన్నప్పుడు ధర్నా చేయడం నిషేధం. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐపీసీ 341, 188, సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తదుపరి విచారణను మార్చి 19కి నాంపల్లి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఏ-3 ఝాన్సీ చనిపోగా.. ఇవాళ హాజరు కాని ఏ-2, ఏ-4కు కోర్టు నోటీసులు జారీచేసింది.
ఇవీ చూడండి:'అక్రమ నిర్మాణాలను తొలగించలేరా?'
Last Updated : Feb 27, 2020, 1:24 PM IST