తెలంగాణ

telangana

ETV Bharat / state

హైకోర్టును ఆశ్రయించనున్న నిజామాబాద్​ రైతులు - హైకోర్టుకు రైతులు

ఎన్నిక వాయిదా వేయాలంటూ నిజామాబాద్​ రైతులు హైకోర్టు మెట్లెక్కనున్నారు. గుర్తులపై అస్పష్టత, ప్రచారానికి సమయం చాలనందున పోలింగ్​ తేదీ మార్చాలని ఇవాళ కోర్టును ఆశ్రయించనున్నారు.

నిజమాబాద్​ రైతులు

By

Published : Apr 4, 2019, 5:36 AM IST

Updated : Apr 4, 2019, 6:54 AM IST

హైకోర్టును ఆశ్రయించనున్న నిజామాబాద్​ రైతులు
నిజామాబాద్​ లోక్​సభ రైతు అభ్యర్థులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తాము పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికను వాయిదా వేయాలని కోరుతూ ఇవాళ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఎన్నికల సంఘం తమకు కేటాయించిన గుర్తులు ఎలా ఉంటాయో చెప్పలేదని.. వాటిపై ప్రచారం చేసుకోవడానికి సమయం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీ తీరుకు నిరసనగా ఉన్నత న్యాయస్థానంలో రిట్​ పిటిషన్​ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై హైదరాబాద్​లో ఓ న్యాయవాదిని సంప్రదించినట్లు పేర్కొన్నారు.
Last Updated : Apr 4, 2019, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details