తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసను ప్రజలు నమ్మే స్థితిలో లేరు : ధర్మపురి అర్వింద్ - హైదరాబాద్ తాజా వార్తలు

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్క రేషన్​కార్డు ఇవ్వలేదని విమర్శించారు.

Nizamabad BJP fire on cm kcr in party office at hyderabad
తెరాసను ప్రజలు నమ్మే స్థితిలో లేరు : ధర్మపురి అర్వింద్

By

Published : Nov 24, 2020, 7:00 PM IST

రాష్ట్రంలో రౌడీలు, కబ్జాదారులు తెరాసలోనే ఉన్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితి లేదని వెల్లడించారు. అధికారం చేపట్టాక ఒక్కరికైనా రేషన్​కార్డు ఇచ్చారా అని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి పరిపాలన చేయకుండా ప్రజలను ఎంటర్​టైన్​మెంట్ చేస్తున్నారని భాజపా ఎంపీ విమర్శించారు. రాష్ట్రంలో ఇతర పార్టీలకు హోర్డింగులు ఇవ్వొద్దని యాడ్ ఏజెన్సీలకు కేటీఆర్ హుకుం జారీ చేయడమేంటని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:తెరాస మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన

ABOUT THE AUTHOR

...view details