తెలంగాణ

telangana

ETV Bharat / state

వేతనాలు చెల్లించాలని నిజాం షుగర్​ కార్మికుల ఆందోళన - వేతనాల కోసం నిజాం షుగర్ కార్మికుల ధర్నా

నిజాం షుగర్ కంపెనీ కార్మికుల హామీలను నెరవేర్చాలని హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్​లో ఆందోళనకు దిగారు. ఐదేళ్లుగా ఉపాధి లేక వందలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించి తమను ఆదుకోవాలని కార్మికుల జేఏసీ నాయకులు డిమాండ్​ చేశారు.

Nizam Sugar workers dharna to pay wages from 2015 in at Indira park in Hyderabad
వేతనాలు చెల్లించాలని నిజాం షుగర్​ కార్మికుల ఆందోళన

By

Published : Feb 18, 2021, 6:44 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో నిజాం షుగర్ కంపెనీ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని నిజాం షుగర్ కంపెనీ కార్మికులు, జేఏసీ కన్వీనర్ సిద్ధ రాములు గౌడ్ డిమాండ్ చేశారు. 2015లో అర్ధాంతరంగా మూసిచేయడంతో వందలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. వేతనాలు చెల్లించి తమను ఆదుకోవాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో ఆందోళన నిర్వహించారు.

బోధన్, మెదక్, మెట్​పల్లి ప్రాంతాలకు చెందిన 300కు పైగా కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. నిజాం షుగర్, బోధన్​లోని డిస్టీలరీ కంపెనీలు ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో కొనసాగుతున్నాయన్నారు. కంపెనీలను అర్ధాంతరంగా లాకౌట్ చేయడంతో కార్మికుల జీవితాలు రోడ్డుమీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కార్మికుల ఆవేదన అర్థం చేసుకొని 2015 నుంచి రావాల్సిన జీతాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి :న్యాయవాద దంపతుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

ABOUT THE AUTHOR

...view details