తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడో నిజాం కుమార్తె బషీరున్నీసాబేగం కన్నుమూత - ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ కుమార్తె సాహెబ్‌జాదీ బషీరున్నీసాబేగం

ఏడో నిజాం రాజు మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ కూతురు సాహెబ్‌జాదీ బషీరున్నీసాబేగం సాహెబా (93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌ పురానాపూల్‌లోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు.

nizam daughter died in hyderabad
ఏడో నిజాం కుమార్తె బషీరున్నీసాబేగం కన్నుమూత

By

Published : Jul 29, 2020, 12:35 PM IST

ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ కుమార్తె సాహెబ్‌జాదీ బషీరున్నీసాబేగం(93) పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణంలోని ఉస్మాన్‌కాటేజ్‌ భవనంలో కన్నుమూశారు. ఏడో నిజాంకు 21 సంవత్సరాల వయసులో 1906 ఏప్రిల్‌ 14న ఆజం ఉన్నీసాబేగంతో వివాహమైంది. ఆయనకు మొత్తం 34 మంది సంతానం. ఆయన సంతానంలో ఇప్పటి వరకు జీవించి ఉన్నది ఈమె ఒక్కరే. బషీరున్నీసాబేగం 1927లో జన్మించారు. దక్కన్‌ హైదరాబాదీ సంస్కృతిని ప్రతిబింబించేలా నగలు ధరించేవారు. ఈమె భర్త నవాబ్‌ ఖాజీంయార్‌జంగ్‌ చాలాకాలం క్రితమే మరణించారు.

ఆమెకు ఒక కుమార్తె షహెబ్‌జాదీ రషీదున్నీసా బేగం, కుమారుడు సంతానం. కుమారుడు సుమారు పాతికేళ్ల క్రితం తప్పిపోయాడు. ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. బషీరున్నీసాబేగం భౌతిక కాయాన్ని పురానీహవేలీ సమీప మసీదుకు తరలించి జనాజా నమాజ్‌ నిర్వహించారు. నిజాం మనవడు నవాబ్ ‌నజాఫ్‌ అలీఖాన్‌, మ్యూజియం డైరక్టర్‌ రఫత్‌హుస్సేన్‌ బేగం, క్యూరేటర్‌ అహ్మద్‌అలీ సంతాపం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: మృతుల కడసారి చూపులకు ప్రత్యేక భవనం

ABOUT THE AUTHOR

...view details