హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం వసతి గృహం ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించారు. గదుల్లో ఫ్యాన్లు, బెడ్లు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చెకింగ్ల పేరుతో పోలీసులు గదులలోకి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్తే అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వసతి గృహానికి చేరుకున్న ప్రిన్సిపాల్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. సమాచారం తెలుసుకున్న సైఫాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థుల సమస్యల గురించి ఆరా తీశారు.
నిజాం వసతి గృహం ఎదుట విద్యార్థుల ఆందోళన - హైదరాబాద్
హైదరాబాద్లోని నిజాం కళాశాల వసతి గృహం ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు.
రోడ్డుపై బైఠాయించిన నిజాం కళాశాల విద్యార్థులు