తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక అంతర్జాలం​లో నిత్య హల్​చల్.! - అభిషేక్ బచ్చన్

మొదటి చిత్రం 'అలా మొదలైంది'తో ఆకట్టుకున్న నిత్యామీనన్ త్వరలో ఓ వెబ్ సిరీస్​లో నటించనుంది. అమెజాన్ ప్రైమ్​లోని 'బ్రీత్' వెబ్​ సిరీస్ రెండో సీజన్​లో నటించేందుకు అంగీకారం తెలిపింది.

నిత్యామీనన్

By

Published : Feb 10, 2019, 7:52 PM IST

నిత్యామీనన్ వెబ్ సిరీస్​లో నటించబోతోంది. అమెజాన్ ప్రైమ్​లోని 'బ్రీత్' రెండో సీజన్​లో నటించేందుకు అంగీకారం తెలిపింది. మొదటి సీజన్​లో అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో, హీరో మాధవన్ విలన్ గా చేశారు.
"ఇది నా మొట్టమొదటి డిజిటల్ సిరీస్. ఇందులో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాలోని నటిని నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశం."
-నిత్యామీనన్, నటి

"సిరీస్​లో నటించేందుకు నిత్య అంగీకారం తెలపడం చాలా సంతోషంగా ఉంది. 'ఓకే కన్మని' చిత్రంలో తన నటన అద్భుతంగా ఉంటుంది. టీం అందరి తరపున ఆమెకు స్వాగతం పలకుతున్నా."
-మయాంక్ శర్మ, వెబ్ సిరీస్ డైరెక్టర్

బ్రీత్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్. త్వరలోనే అమెజాన్ ప్రైమ్​లో రెండో సీజన్ విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details