తెలంగాణ

telangana

ETV Bharat / state

Rajeev kumar: తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది: రాజీవ్​ కుమార్​

తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలుస్తోందని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మెరుగైన పారిశ్రామిక విధానాలు, భౌగోళిక పరిస్థితులతో తొమ్మిది శాతానికి పైగా వృద్ధిరేటు సాధిస్తోందని తెలిపారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధిని గుర్తించి కితాబిచ్చిన నీతిఆయోగ్​కు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Niti aayog vice president rajeev kumar
నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్

By

Published : Sep 12, 2021, 4:30 PM IST

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ 9 శాతానికి మించిన వృద్ధి రేటు సాధిస్తోందని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ప్రశంసించారు. రాష్ట్రంలో మెరుగైన పారిశ్రామిక విధానాలు, భౌగోళిక పరిస్థితుల వల్లే అది సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలోనే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని రాజీవ్​ కుమార్ అన్నారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధిని గుర్తించి కితాబిచ్చిన నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్​ కుమార్​కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.

ట్విట్టర్​ ద్వారా కేటీఆర్​ కృతజ్ఞతలు

రాష్ట్ర అభివృద్ధిని గుర్తించినందుకు నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్​కు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ 9 శాతానికి పైగా వృద్ధిరేటు సాధించడం మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:KTR: ఒకే చోట 15,660 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు.. అద్భుత దృశ్యం: కేటీఆర్‌ ట్వీట్‌

ABOUT THE AUTHOR

...view details