తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ వ్యాఖ్యలపై నీతిఆయోగ్ స్పందన... బహిష్కరణ సరికాదంటూ... - cm kcr on nITI aayog

NITI Aayog on cm kcr comments: సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై నీతిఆయోగ్‌ స్పందించింది. నీతిఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించటం దురదృష్టకరమని సంస్థ పేర్కొంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం బహిష్కరణ సరికాదని తెలిపింది. బలమైన రాష్ట్రాలు, దేశం తయారు చేయటమే సంస్థ లక్ష్యమని వెల్లడించింది.

NITI AAYOG RESPONDS KCR COMMENTS
కేసీఆర్ వ్యాఖ్యలపై నీతిఆయోగ్ స్పందన

By

Published : Aug 6, 2022, 8:14 PM IST

NITI Aayog on cm kcr comments: నిరర్థక సంస్థగా మారిందన్న కేసీఆర్‌ వ్యాఖ్యల్ని నీతి ఆయోగ్‌ తప్పుపట్టింది. రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టామన్న నీతి ఆయోగ్‌... గతేడాదిలో ముఖ్యమంత్రులతో 30కి పైగా సమావేశాలు నిర్వహించామని తెలిపింది. 2021లో తమ ప్రతినిధి బృందం తెలంగాణ సీఎంను కూడా కలిసిందన్న సంస్థ... ఇటీవల సమావేశం కోసం ఎన్ని అభ్యర్థనలు పంపినా... స్పందన లేదని పేర్కొంది.

NITI Aayog comments on kcr:గత నాలుగేళ్లుగా జలజీవన్ మిషన్‌ కింద భారత ప్రభుత్వం తెలంగాణకు 3,982 కోట్లు కేటాయించినా... రాష్ట్రం కేవలం 200కోట్లు మాత్రమే వినియోగించుకుందని తెలిపింది. ప్రధానమంత్రి క్రిషి సించాయి యోజన కింద ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి అదనంగా 1,195కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు పేర్కొంది.

NITI Aayog:సమావేశాల ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరమయ్యాయన్న నీతి ఆయోగ్‌... ఇవి రాష్ట్రాల మధ్య మరింత సహకారానికి మార్గం సుగమం చేశాయని పేర్కొంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాధాన్య పథకాలు, కార్యక్రమాలు సహా ఆర్థిక విషయాలలో కేంద్రం రాష్ట్రాలకు స్థిరంగా మద్దతు ఇస్తోందని తెలిపింది. రేపటి నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనకూడదన్న కేసీఆర్‌ నిర్ణయం దురదృష్టకరమని పేర్కొంది.

సహకార సమాఖ్య పటిష్టతకే నీతిఆయోగ్ ఏర్పాటు. రాష్ట్రాలతో సన్నిహితంగా పనిచేసేందుకు ఎన్నోచర్యలు చేపట్టాం. గతేడాది సీఎంలతో 30కి పైగా సమావేశాలు జరిగాయి. నీతిఆయోగ్, రాష్ట్రాల మధ్య సహకారానికి మార్గం సుగమం చేశాం. రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించాం. జల్‌జీవన్ మిషన్ కింద తెలంగాణకు కేంద్రం రూ.3982 కోట్లు కేటాయించింది. తెలంగాణ రూ.200 కోట్లు మాత్రమే వినియోగించుకుంది. 2016తో పోలిస్తే 2022 నాటికి కేంద్ర పథకాల నిధులు రెట్టింపు అయ్యాయి. ఆర్థిక సంఘం నిధులు 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగాయి. -నీతిఆయోగ్‌

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details