తెలంగాణ

telangana

16వ ఆర్థిక సంఘంలో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలి : సీఎం రేవంత్​ రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 9:34 PM IST

Niti Aayog Members Meet CM Revanth Reddy : రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు చిత్తశుద్ధితో కలిసి పనిచేస్తాయని నీతిఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నాయి. సచివాలయంలో నీతి ఆయోగ్​ బృందం సీఎం రేవంత్​ రెడ్డిని కలిశారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, విధాన పరమైన నిర్ణయాలపై చర్చించారు. 16వ ఆర్థికసంఘంలో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Niti Ayog Members and CM Revanth Reddy  Discuss Telangana Development
Niti Ayog Members Meet CM Revanth Reddy

Niti Aayog Members Meet CM Revanth Reddy : హైదరాబాద్​ను కాలుష్య రహిత అర్బన్ గ్రోత్ హబ్​గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నీతి ఆయోగ్​ బృందాన్ని కోరారు. భాగ్యనగరానికి వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, సభ్యుడు వీకే సారస్వత్​తో సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సీఎస్ శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీతి ఆయోగ్ బృందం సభ్యులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి అంశాలు, విధాన పరమైన నిర్ణయాలు, పరస్పర సహకారంపై సమావేశంలో చర్చ జరిగింది. దీంతో పాటు వినూత్న ప్రభుత్వ విధానాలు, విజయవంతమైన నమూనాలపై చర్చించారని తెలుస్తోంది.

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్​గా అరవింద్‌ పనగఢియా నియామకం

CM Revanth Reddy Explain Telangana Issues : సమాఖ్య సహకారం, అభివృద్ధి ప్రాధాన్యాలు, నిధుల కేటాయింపు, వినూత్న- ఉత్తమ విధానాలు, నైపుణ్యాభివృద్ధి, స్టేట్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్​ఫర్​మేషన్​ ఏర్పాటు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు చిత్తశుద్ధితో కలిసి పనిచేస్తాయని నీతిఆయోగ్(Niti Ayog), రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నాయి. రాష్ట్ర అభివృద్ధి ప్రాధాన్యాలను సీఎం వివరించారు. ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశాలను తెలిపారు.

Niti Ayog Members Telangana Visit : రాష్ట్ర ప్రత్యేక అవసరాల గురించి, సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన చర్యలపై నీతిఆయోగ్ వివరించింది. కేంద్ర నిధుల్లో రాష్ట్రానికి తగిన వాటా ఇవ్వాలని, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు వనరులు సమకూర్చాలని ముఖ్యమంత్రికోరారు. 16వ ఆర్థికసంఘంలో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని విజ్ఞాప్తి చేశారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన రూ.1800 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

palle prakruthi vanam: పల్లెప్రకృతి వనం భేష్​.. సామాజిక రంగంలో నీతిఆయోగ్​ గుర్తింపు

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారిలో నైపుణ్యాభివృద్ధిపై పలు అంశాలను చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సౌరవిద్యుత్ ఉత్పత్తి పెంపు, కేంద్రం నుంచి తగిన సహకారంపై ముందుకు సాగాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద స్టేట్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్​ఫర్​మేషన్ (సిట్) ఏర్పాటు విషయపై చర్చ జరిగింది.

CM Revanth Reddy on Musi River Development : సబర్మతి రివర్ ఫ్రంట్, నమామి గంగే తరహాలో పీపీపీ విధానంలో మూసీనది అభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మూసీ నది తీరం వెంట ఎస్టీపీల ఏర్పాటు కోసం తోడ్పాటు అందించాలన్నారు. పాలకమండలి సమావేశాల్లో పాల్గొనాలని నీతిఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నీతి ఆయోగ్ చేపట్టే అన్ని చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్మాణాత్మక మద్ధతు, సహకారం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క హామీ ఇచ్చారు.

త్వరలోనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

అంబులెన్స్​కు దారిచ్చిన సీఎం రేవంత్​ రెడ్డి - వీడియో వైరల్

ABOUT THE AUTHOR

...view details