పర్యావరణ మార్పుల నేపథ్యంలో వరి, గోధుమ, మొక్కజొన్న లాంటి పంటలకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలను సాగు చేయాలని నీతి ఆయోగ్ సభ్యుడు రాజ్ భండారి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ నోవాటెల్‌లో జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరగనున్న "న్యూట్రీ సెరెల్స్ కాన్‌క్లేవ్ - 2019" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐఐఎంఆర్ ఇన్ఛార్జి డైరెక్టర్ డాక్టర్ ఎస్.సత్యనారాయణరావు, న్యూట్రీ హబ్ సీఈఓ డాక్టర్ దయాకర్, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి చిరుధాన్యాలు, ఆహారోత్పత్తుల తయారీదారులు, అంకుర సంస్థల నిర్వాహకులు తరలివచ్చారు. చిరుధాన్యాల ఆహారోత్పత్తులకు సంబంధించి పలు అంకుర సంస్థలు తమ స్టాళ్లు ఏర్పాటు చేశారు.
చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకున్నట్లైతే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని నీతిఆయోగ్ సభ్యుడు రాజ్భండారి ప్రస్తావించారు. గర్భిణీ స్త్రీలు, చిన్నారుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలకు పరిష్కారం ఒక్క చిరుధాన్యాలేనని స్పష్టం చేశారు. దారిద్ర్య రేఖకు దిగవనున్న కుటుంబాల్లో పౌష్టికాహారం లేమిని అధిగమించేందుకు కేంద్రం 2018లో ప్రతిష్ఠాత్మక 'పోషన్ అభియాన్' కార్యక్రమం ప్రవేశపెట్టిందని రాజ్ భండారి తెలిపారు.
'చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు' - 'చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు'
హైదరాబాద్ మాదాపూర్ నోవాటెల్‌లో 2 రోజుల పాటు జరగనున్న "న్యూట్రీ సెరెల్స్ కాన్‌క్లేవ్ - 2019" కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యుడు రాజ్ భండారి హాజరయ్యారు. చిరుధాన్యాలు ఆహారంలో భాగంగా చేసుకున్నట్లైతే ఆరోగ్యంగా జీవించవచ్చని సూచించారు.
'చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు'