తెలంగాణ

telangana

ETV Bharat / state

నిసర్గ ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులు వర్షాలు - తెలంగాణపై నిసర్గ తుపాను ప్రభావం

నిసర్గ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే వీలుందని వెల్లడించారు.

nisraga-cyclone-effect-in-telangana-state
నిసర్గ ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు

By

Published : Jun 3, 2020, 3:45 PM IST

నిసర్గ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల... తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న వెల్లడించారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్‌తో పాటు కరీంనగర్, మెదక్, జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురుస్తాయని ప్రకటించారు.

నిసర్గ ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు

ఇవీ చూడండి:తీరాన్ని తాకిన నిసర్గ తుపాను.. గాలుల బీభత్సం

ABOUT THE AUTHOR

...view details