BJP Nirudyoga deeksha: తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కరోజు దీక్షకు పిలుపునిచ్చారు. ఇందిరా పార్కు వద్ద ఒక్కరోజు దీక్ష చేసేందుకు బండి సంజయ్ పూనుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ ఆంక్షల కోసం కీలక ఉత్తర్వులను జారీ చేయగా... బండి సంజయ్ దీక్షపై సందిగ్ధత నెలకొంది.
BJP Nirudyoga deeksha: బండి సంజయ్ నిరుద్యోగ దీక్షా వేదిక మార్పు
16:40 December 26
BJP Nirudyoga deeksha : బండి సంజయ్ నిరుద్యోగ దీక్షా వేదిక మార్పు
మారిన దీక్షాస్థలం
ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు తలపెట్టిన నిరుద్యోగ దీక్షలో చిన్న మార్పు చేశారు. నిరుద్యోగ దీక్షను ముందుగా ప్రకటించినట్లుగా ఇందిరా పార్కు వద్ద కాకుండా నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి మార్చినట్లు వెల్లడించారు. భాజపా రాష్ట్ర కార్యాలయ ఆవరణలో నిరుద్యోగ దీక్ష చేయనున్నట్లు సంజయ్ ప్రకటించారు. భాజపా నిరుద్యోగ దీక్షకు భయపడే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగే నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలి భాజపా పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి:
Bandi fire on CM KCR: 'త్వరలోనే కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపుతాం'