Nirmala Sitharaman on Digitization: దేశం ఆర్థికంగా ఎదగడానికి డిజిటలైజేషన్, ఆవిష్కరణ, వ్యవస్థాకత అనేవి మూడు స్తంభాలుగా వ్యవహరిస్తాయి అనే అంశంపై ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఎన్‌ఐఎఫ్‌టీ, ఎన్‌ఐడీ, ఎఫ్‌డీడీఐ, ఐఐఎఫ్‌టీ విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన నిర్మలా సీతారామన్.. వచ్చే 25 ఏళ్ల కాలపరిమితిలో మన దేశ సంస్కృతిని, సంప్రదాయలను విస్తరించి.. దేశంలో ఉన్న బ్రిటీష్ కాలపు గుర్తులను తుడిచి పారేయాలని పేర్కొన్నారు. మన దేశ ఉత్పత్తులను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.