తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓ రాష్ట్రం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది' - కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్

Nirmala Seetharaman: రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ రాష్ట్రం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని వాళ్లు కూడా దేశవ్యాప్తంగా ప్రచారానికి మాత్రం విపరీతంగా ఖర్చు చేస్తున్నారన్నారు.

central minister Nirmala Seetharaman
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

By

Published : Dec 21, 2022, 10:51 PM IST

Finance Minister Nirmala Sitharaman: ప్రతి ఒక్కరూ తాము అనుసరించే విధానాల్లో పారదర్శకత ఉందా? లేదా? అన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఉచితాలపై ఇక్కడ చర్చకు తావేలేదని ఆమె పేర్కొన్నారు. బుధవారం రాజ్యసభ్యలో ఆమె వివిధ అంశాలపై మాట్లాడారు. ‘‘ఒక రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఉద్యోగులంతా నిరసనకు దిగారు. సదరు ప్రభుత్వం నిధులన్నింటినీ దేశవ్యాప్తంగా భారీ ప్రకటనలకు ఖర్చు చేయడమే ఈ దుస్థితికి కారణం. రాయితీలు, ఉచితాలు సందర్భోచితంగా ఉండాలి. ఒకవేళ మీరు బడ్జెట్‌లో వాటిని పెడితే అందుకు తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. మీకు ఆదాయం ఉంటే డబ్బులు ఇవ్వొచ్చు. ఈ విషయంలో మీకెవరూ అభ్యంతరం చెప్పరు. విద్య, ఆరోగ్యం, రైతులకు పలు రాయితీలు వంటివి ఇవ్వడం న్యాయమైనవి.’’ అని అన్నారు. తన మాటల్లో ఫలానా రాష్ట్రం అని నిర్మలా సీతారామన్‌ పేర్కొనలేదు.

ABOUT THE AUTHOR

...view details