యూరియా సరఫరా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పు లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. యూరియా సరఫరా విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ హాకా భవన్‌లో యూరియా సరఫరా, రైతుల ఇబ్బందులపై వ్యవసాయ, సహకార శాఖలు, మార్క్‌ఫెడ్ సంస్థ, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఉత్తర భారతంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యూరియా సరఫరా ఆలస్యమైందని తెలిపారు. సెప్టెంబర్ మాసానికి అవసరమైన యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. యూరియాను బ్లాక్ చెయడం సాధ్యం కాదని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో యూరియా కోసం కేంద్రానికి వెళ్లిన సమయంలో రైతు గుండెపోటుతో చనిపోవడం బాధాకరమన్నారు. సరైన అవగాహనలేకనే విపక్షాలు యూరియా అంశాన్ని రద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
యూరియా విషయంలో రాజకీయాలొద్దు: మంత్రి నిరంజన్ రెడ్డి - niranjan reddy
యారియా సరఫరా విషయంలో అనవసర రాజకీయాలు చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా సరఫరా చేస్తామని చెప్పారు. హైదరాబాద్ హాకా భవన్‌లో యూరియా సరఫరా, రైతుల ఇబ్బందులపై వ్యవసాయ, సహకార శాఖలు, మార్క్‌ఫెడ్ సంస్థ, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.
నిరంజన్ రెడ్డి