తెలంగాణ

telangana

ETV Bharat / state

NIMS New Block Foundation in Hyderabad : ఈ నెల 14న నిమ్స్ కొత్త భవనానికి శంకుస్థాపన - నిమ్స్​లో మాతాశిశు వైద్యం

Hyderabad NIMS New Block Foundation : దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఒకటిగా నిమ్స్ అవతరించనుంది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిమ్స్‌లో నూతనంగా నిర్మించనున్న దశాబ్ది బ్లాక్‌ కొత్త భవనానికి సీఎం కేసీఆర్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 18 వందల పడకలు.. 2 వేల 200 చేరనున్నాయి. పెరగనున్న పడకలతో నిమ్స్ ఆసుపత్రి పేదలకు మరింత మెరుగైన సేవలు అందించనుంది.

Hyderabad NIMS Expansion Update
Hyderabad NIMS Expansion Update

By

Published : Jun 13, 2023, 10:13 AM IST

ఈ నెల 14న సీఎం కేసీఆర్ నిమ్స్​లో 2 వేల పడకల భవనంకు శంకుస్థాపన

NIMS Hospital Expansion In Hyderabad :పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న తెలంగాణ సర్కారు నిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి మరింత పెద్దపీట వేసింది. ఇప్పటికే దాదాపు 30కి పైగా విభాగాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న నిమ్స్ అదనంగా మరో 2 వేల పడకల నూతన బ్లాక్ నిర్మాణం చేపడుతోంది. దీనికి బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.

NIMS New Block Foundation in Hyderabad :ప్రస్తుతంనిమ్స్ ఆసుపత్రిలో 1800 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులో ఉండగా.. నిత్యం ఆసుపత్రి రోగులతో కిక్కిరుస్తున్న పరిస్థితి. దీనికి తోడు అన్ని రకాల వైద్య సేవలు అందుతున్న నిమ్స్​లో మాతాశిశు వైద్యం అందుబాటులో ఉంటే మంచిదని భావించిన సర్కారు.. ఇటీవలే నిమ్స్ ప్రాంగణంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ బ్లాక్​కి సైతం శంకుస్థాపన చేసింది. ఇక దశాబ్ది ఉత్సవాల వేళ రూ.1.571 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో నూతన బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దశాబ్ది పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ బ్లాక్ నిర్మాణానికి ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేయనున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

NIMS New Building Foundation in Hyderabad : దశాబ్ది పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ నూతన బ్లాక్ నిర్మాణ బాధ్యతలను ఇప్పటికే సర్కారు ఆర్​అండ్​బీ శాఖకు అప్పగించింది. మొత్తం 32 ఎకరాల 16 గుంటల స్థలంలో రూపుదిద్దుకోనున్న నూతన భవన సముదాయంలో మొత్తం 4 బ్లాక్​లను అందుబాటులోకి తేనున్నారు. అందులో ఓపీ సేవల కోసం ఒక బ్లాక్, ఐపీ సేవల కోసం రెండు బ్లాక్​లు, ఎమర్జెన్సీ సేవల కోసం మరో బ్లాక్ అందుబాటులో ఉంచనున్నారు. ఓపీ, ఎమర్జెన్సీ బ్లాక్​లలో లోవర్ గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్​లతో పాటు ఒక్కో బ్లాక్​లో మరో 8 ప్లోర్​లు నిర్మించనున్నారు.

ఇక ఐపీ బ్లాక్​లలో గ్రౌండ్ ఫ్లోర్ కలిపి ఒక్కో దానిలో 15 ఫ్లోర్​లు రూపుదిద్దుకోనున్నాయి. 120 ఓపీ గదులు, సహా 1200 ఆక్సిజన్ బెడ్​లు, 500 ఐసీయూ పడకలు నూతన బ్లాక్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 38 విభాగాలకు సంబంధించిన సేవలను ఇక్కడ అందించనుండగా.. అందుకోసం 32 మాడ్యూలార్ ఆపరేషన్ థియేటర్​లు, 6 మేజర్ మాడ్యూలార్ థియేటర్​లు సిద్ధం చేయనున్నారు. నూతన భవన సముదాయంలో అందుబాటులోకి వచ్చే పడకలతో కలిపి నిమ్స్​లో బెడ్స్ సంఖ్య 4000కి చేరనున్నాయి. ఫలితంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని సర్కారు భావిస్తోంది. అయితే బుధవారం (ఈ నెల 14న) జరగనున్న భూమి పూజ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే మంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details