తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమ్స్​లో దాడి - doctor

నిమ్స్​లో ఓ మృతురాలి తరఫు బంధువులు వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. భద్రత పెంచుతామని నిమ్స్ డైరెక్టర్ మనోహర్​ హామీతో ఆందోళన విరమించారు.

వైద్యుడిపై దాడి

By

Published : Mar 2, 2019, 5:08 AM IST

Updated : Mar 2, 2019, 9:52 AM IST

వైద్యుడిపై దాడి
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో విధులు నిర్వహిస్తున్నవైద్యుడిపై ఓ మృతురాలి తరపు బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డాక్టర్​కు స్వల్ప గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

నిమ్స్​లో మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆవేదనకు గురైన మృతురాలి బంధువులు వైద్యుడిపై దాడికి దిగారు. డాక్టర్లు అత్యవసర విధులు మినహా వైద్య సేవలను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. భద్రత పెంచుతామనే నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ హామీతో వైద్యులు ఆందోళన విరమించారు. మార్చి 11 వరకు భద్రత పెంచకపోతే సమ్మె తప్పదని వైద్యులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:తేదీలు ఖరారు

Last Updated : Mar 2, 2019, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details