కోల్కతాలో జూనియర్ వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిమ్స్ ఆస్పత్రి వద్ద వైద్యులు నిరసనకు దిగారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చి... ఓపీ సేవలను నిలిపివేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన రోగులు... వైద్య సేవలు అందకపోడం వల్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి రోగులను సిబ్బంది బయటకు పంపిస్తుండటం వల్ల, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమకు వైద్య సేవలు అందించాలని వేడుకుంటున్నారు.
నిమ్స్ ఆస్పత్రి వద్ద రోగుల ఇక్కట్లు - nims hospital
వైద్యులపై దాడులను ఖండిస్తూ నిమ్స్ ఆస్పత్రి వద్ద వైద్యులు నిరసనకు దిగడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు
నిమ్స్ ఆస్పత్రి వద్ద రోగుల ఇక్కట్లు
TAGGED:
nims hospital