ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్స చేసేందుకు అనుమతిస్తూ కేంద్రం తీసుకొచ్చిన జీవోను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. ఐఎమ్ఏ పిలుపుతో నిమ్స్ ఆస్పత్రిలో రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆస్పత్రిలోని స్పెషాలిటీ బ్లాక్ నుంచి ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు.
ఆయుర్వేద జీవోకు వ్యతిరేకంగా నిమ్స్ ఆస్పత్రిలో నిరసన - హైదరాబాద్ జిల్లా వార్తలు
ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలకు అనుమతిస్తూ కేంద్రం తీసుకొచ్చిన జీవో పట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. జీవోకు వ్యతిరేకంగా నిమ్స్ ఆస్పత్రిలో నిరసన చేపట్టారు. ఈ జీవోను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆయుర్వేద జీవోకు వ్యతిరేకంగా నిమ్స్ ఆస్పత్రిలో నిరసన
నిమ్స్ ఆస్పత్రిలో రెసిడెంట్ వైద్యులు ఓపీ, ఎంపిక చేసిన శస్త్ర చికిత్సలను బహిష్కరించినట్లు రెసిడెంట్ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ గౌడ్ తెలిపారు. అత్యవసర సేవలు, కొవిడ్ చికిత్సల్లో మాత్రం పాల్గొంటామని ఆయన తెలిపారు. కేంద్రం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రెసిడెంట్ వైద్యులు తెలిపారు.