తెలంగాణ

telangana

ETV Bharat / state

నిలోఫర్​లో క్లినికల్ ట్రయల్స్​పై ముగిసిన విచారణ - niloufer clinical trials issue

నిలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్​పై త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది. ఇవాళ రాత్రిలోపు ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది.

Niloufer Inquiry End Completed

By

Published : Sep 30, 2019, 4:58 PM IST

క్లినికల్ ట్రయల్స్​పై ముగిసిన విచారణ... ఇవాళ రాత్రిలోపు ప్రభుత్వానికి నివేదిక

నిలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్​పై త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది. క్లినికల్ ట్రయల్స్ జరిగిన పిల్లలతో మాట్లాడిన కమిటీ సభ్యులు... వారి తల్లిదండ్రులను కూడా విచారించారు. నిలోఫర్‌ హాస్పిటల్‌లో క్లినికల్ ట్రయల్స్ ఎథికల్‌గానే జరుగుతున్నాయని విచారణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆసుపత్రి పిల్లల వైద్య విభాగాధిపతి గదితోపాటు... వైద్య చికిత్స జరిగిన గదులను పరిశీలించారు. బోర్డు రూమ్‌లో ఆసుపత్రి సూపరింటెండెంట్​తోపాటు వైద్యులు రవికుమార్‌ను కూడా కమిటీ విచారించింది. ఇవాళ రాత్రిలోపు ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ త్రిసభ్య కమిటీలో డాక్టర్ రాజారావు, లక్ష్మీ కామేశ్వరీ, విమలా థామస్‌లు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details