రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలో పాల్గొనడం తెలంగాణకు ఎంతో గర్వకారమని స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. నిఖత్ ఇంటర్నేషనల్ ఇస్తాంబుల్ స్పోర్ట్స్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో.. 51 కేజీల ఎలైట్ ఉమెన్ విభాగంలో భారత్ తరపున పాల్గొంటారని పేర్కొన్నారు.
ఈ నెల 15 నుంచి 21 వరకు ఇస్తాంబుల్, టర్కీలో జరగనున్న బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్ తరపున ఎలైట్ పురుషుల్లో 13 మంది, ఎలైట్ మహిళల్లో 11 మంది పాల్గొంటారని ఆయన వెల్లడించారు. నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుందని చెప్పారు.