నిజాంపేటలో దేవీ నవరాత్రి ఉత్సవాలు - nijampet devi navaratri celebrations
నిజాంపేటలోని కనకదుర్గ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ కనకదుర్గమ్మ మంగళ గౌరి రూపంలో దర్శనమిచ్చింది.

నిజాంపేటలో దేవి నవరాత్రి ఉత్సవాలు
నిజాంపేటలో దేవి నవరాత్రి ఉత్సవాలు
హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని కనకదుర్గ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు మంగళ గౌరి దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం సామూహిక కుంకుమార్చన, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం పండ్లతో అలంకరించారు. విజయవాడ కనకదుర్గ అమ్మ వారికి జరిగే విధంగా నిజాంపేటలో నవరాత్రి వేడుకల సమయంలో పూజలు జరుగుతాయని తెలిపారు.
Last Updated : Oct 1, 2019, 7:14 PM IST