Nigerians Links in Drug Cases Caught in Hyderabad : గత నెల 31న మాదాపూర్ సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో రేవ్‌పార్టీలతో బయటపడి మత్తుదందాతో టాలీవుడ్ లింకులు(Tollywood Drugs Case) ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. అప్పుడు అరెస్టయిన బాలాజీ, వెంకటరత్నారెడ్డి సెల్‌ఫోన్ నంబర్లు, వాంగ్మూలం ఆధారంగా సినీ, రాజకీయ ప్రముఖులతో లింకులు బయటపడ్డాయి. దీని ఆధారంగా తాజాగా ముగ్గురు నైజీరియన్ల(Nigerians)తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు అడ్డాగా మార్చుకున్న నైజీరియన్లు ఏపీ, తెలంగాణల్లోని పెడ్లర్స్‌కు డ్రగ్స్ చేరవేస్తున్నారని పోలీసులు గుర్తించారు. పోలీసులకు దొరక్కుండా, సాంకేతికత నిఘాకు చిక్కకుండా లావాదేవీలు నిర్వహిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తున్నారు.
Tollywood Drugs Case Updates : టాలీవుడ్ ప్రముఖుల్లో 'డ్రగ్స్' దడ.. ఎప్పుడు ఎవరి పేరు తెరపైకొస్తుందోనని టెన్షన్.. టెన్షన్..
Drugs Racket at Hyderabad : డ్రగ్స్ దందా(Drugs Case)లోని నైజీరియన్లు బెంగళూరు చేరగానే నకిలీ పాస్‌పోర్టు, వీసాలు తయారు చేస్తారు. వాటి ద్వారా అక్కడ ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఇంటర్నెట్ సదుపాయం పొందుతున్నారు. తమ దేశపు సిమ్‌కార్డులను ఉపయోగించి వైఫై వాట్సాప్, షేర్‌చాట్ ద్వారా పెడ్లర్స్, ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. సంభాషణలు, చాటింగ్స్ ఎన్‌క్రిప్ట్‌లో ఉండటంతో పోలీసులు గుర్తించలేకపోతున్నట్లు సమాచారం. కొనుగోలుదారులు పట్టుబడినా వారి వద్ద లభించే ఐపీ అడ్రస్ ఆధారంగా సూత్రదారులను గుర్తించటం సవాల్‌గా మారుతోంది. నగరం నుంచి కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ కొనుగోలు చేసేందుకు వెళ్లిన వారికి తమ చిరునామా, ముఖం తెలియకుండా నైజీరియన్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Nigerian Drug Dealers Hyderabad : డ్రగ్స్ దందాలో.. నైజీరియన్ల రూటే సపరేటు
Nigerian Drug Peddlers Arrest in Hyderabad : సరుకు ఆర్డర్‌కు బకరా.. కోక్.. శాండిల్ వంటి కోడ్ భాష ఉపయోగిస్తున్నారు. నగదు చేతిలో పడ్డాక మాత్రమే సరుకు ఎక్కడ తీసుకోవాలనేది చెబుతారు. నిర్దేశించిన ప్రదేశాల్లో కిరాణా, పాన్, పాల దుకాణాల వద్ద డ్రగ్స్ ప్యాకెట్లు అందజేస్తారు. దీనికి ప్రతిఫలంగా దుకాణదారులకు కొంత కమీషన్ ఇస్తారు. కొన్ని ముఠాలు నిర్మానుష్య చీకటి ప్రదేశాలల్లో పొట్లాలు ఉంచి దూరంగా ఉండి గమనిస్తారు. ఇరువైపుల లావాదేవీలు పూర్తయినట్లు ధ్రువీకరించేందుకు ‘బ్రో’ అనే సంకేతం ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో తెలింది.
Tollywood Drugs Case Update : మాదాపూర్‌లో బయటపడిన మత్తుదందాతో విశాఖపట్టణానికి చెందిన కొంత మంది లింకులు బయటపడ్డాయి. ఈవెంట్ మేనేజర్ కలహర్‌రెడ్డి, సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాము అలియాస్ రాంచందర్ ఆధ్వర్యంలో విశాఖలోనూ రేవ్‌పార్టీలు నిర్వహించేవారు. అక్కడి కొన్ని హోటళ్లు, అపార్ట్‌మెంట్స్‌ను అధిక అద్దెలకు తీసుకునేవారు. దిల్లీ, ముంబయి, హైదరాబాద్ నుంచి కొందరు మోడల్స్, సినీ తారలను ఆకర్షణగా ఉంచేవారు. స్థానికంగా కొందరు రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు కూడా పార్టీలకు హాజరైనట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల సెల్‌ఫోన్ల కాల్‌డేటాలో విశాఖపట్టణం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన కొందరి ప్రజాప్రతినిధుల పేర్లు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
Tollywood Drugs Case Update : టాలీవుడ్‌లో మరోసారి మత్తు కలకలం!.. నిందితుల్లో సినీ దర్శకుడు, మాజీ ఎంపీ కుమారుడు
Hyderabad Drugs Case Update : టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. నిర్మాత వెంకట్ అరెస్టుతో వారిలో కలవరం