మనుషుల అక్రమ రవాణాపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తొలిసారి హైదరాబాద్‌లో కేసు నమోదు చేసింది. ఏప్రిల్‌లో హైదరాబాద్ ఛత్రినాక పోలీసులు కందికల్ గేట్ బాజీనగర్లో ఓ ఇంటిపై దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నవారిని అరెస్టు చేశారు. వీరు బంగ్లాదేశ్‌కు చెందిన యువతులను వ్యభిచార రొంపిలోకి దింపి ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురు మహిళలకు పోలీసులు విముక్తి కల్పించారు. అనంతరం ఈ కేసు సీసీఎస్‌కు బదిలీ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన యువతులు పట్టుబడినందున.. ఎన్ఐఏ ఈ మొత్తం వ్యవహారంపై కేసు నమోదు చేసిందని అధికారులు తెలిపారు.
మానవ అక్రమ రవాణాపై ఎన్ఐఏ కేసు నమోదు
ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ఛత్రినాక పోలీసులకు వ్యభిచారం కేసులో బంగ్లాదేశ్‌కు చెందిన యువతులు పట్టుబడ్డారు. ఈ విషయమై జాతీయ దర్యాప్తు సంస్థ మానవ అక్రమ రవాణాపై హైదరాబాద్‌లో కేసు నమోదు చేసింది.
మానవ అక్రమ రవాణాపై ఎన్ఐఏ కేసు నమోదు