తెలంగాణ

telangana

ETV Bharat / state

మానవ అక్రమ రవాణాపై ఎన్​ఐఏ కొరఢా - మయన్మార్, బంగ్లాదేశ్‌ గుండా దేశంలోకి ఏజెంట్లు

NIA Focus on Human Trafficking in Hyderabad : మానవఅక్రమ రవాణానిరోధానికి జాతీయదర్యాప్తు సంస్థ- ఎన్ఐఏ అధికారులు నడుంకట్టారు. వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో భాగంగా అధికారులు దేశవ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. అసోంలో నమోదైన ఓ కేసులో భాగంగా దేశంలోని10 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన అధికారులు ఏజెంట్లను అరెస్ట్‌ చేశారు. మయన్మార్, బంగ్లాదేశ్ మీదుగా అక్రమంగా లోపలికి ప్రవేశిస్తున్నారని గుర్తించిన ఎన్‌ఐఏ.. వ్యభిచారం, శ్రమదోపిడీ, బాలకార్మికుల రూపంలో మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తేల్చారు.

Women Trafficking
Human Trafficking in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2023, 9:23 AM IST

Human Trafficking in Hyderabad మానవ అక్రమ రవాణాపై ఎన్​ఐఏ కొరఢా మయన్మార్ బంగ్లాదేశ్‌ గుండా దేశంలోకి ఏజెంట్లు

NIA Focus on Human Trafficking in Hyderabad : ఉపాధి పేరిట పలువురు యువతులను.. బంగ్లాదేశ్ సరిహద్దుల మీదుగా భారత్‌లోకి తీసుకొస్తున్నకొన్ని ముఠాలు ఆ తర్వాత వ్యభిచారకూపంలోకి దింపుతున్నాయి. పశ్చిమబంగాల్‌ మీదుగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఆ తర్వాత కొన్నాళ్లపాటు అక్కడే మకాం వేస్తున్నారు. ఏజెంట్ల సాయంతో.. స్థానికంగా గుర్తింపు కార్డులను పొంది... హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాలకు యువతుల్ని తరలిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆ తర్వాత వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు.

దేశం కాని దేశంలోకి వచ్చి, ఎటువెళ్లాలో తెలియక.. ముఠాల బెదిరింపులతో యువతులు వ్యభిచారగృహాల్లోమగ్గుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌చౌక్.. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పహాడీషరీప్ సీఎస్​లో మూడేళ్ల క్రితం నమోదైన కేసుల్లో ఆ విషయాలు బయటపడ్డాయి. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తొలిసారి మానవ అక్రమ రవాణా కేసును 2019 ఆగస్టు 9న చేపట్టారు. హైదరాబాద్‌ కమిషనరేట్ చత్రినాక పీఎస్ పరిధిలోని ఉప్పుగూడలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకుల్ని అరెస్ట్‌ చేశారు.

అన్​లాక్​ తర్వాత మళ్లీ మొదలు.. మహిళల అక్రమ రవాణాలో ఏడుగురి అరెస్టు

Human Trafficking in Hyderabad :పశ్చిమబంగాల్‌కు చెందిన దంపతులు.. బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తేలడంతో.. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎన్ఐఏ అధికారులు తొలిసారి మానవ అక్రమ రవాణా కేసును దర్యాప్తు చేపట్టారు. రాచకొండ కమిషనరేట్ పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలోని జల్‌పల్లిలో 10మంది బంగ్లాదేశ్‌ యువతులను పోలీసులు రక్షించి షెల్టర్ హోంలలో ఉంచారు.మయన్మార్​కుచెందిన రోహింగ్యాలు సైతం... అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థలో తేలింది.

ఇటీవలే ఎన్‌ఐఏ అధికారులు దేశంలోని 10 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. 55 ప్రాంతాల్లో సోదాలు చేసి 44మంది ఏజెంట్లను అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా డిండిలోనూ రోహింగ్యాలను అదుపులోకి తీసుకున్నారు. అసోం మీదుగా దేశంలోకి ప్రవేశించిన రోహింగ్యాలు తొలుత హైదరాబాద్‌లో ఉండి.. ఇటీవలే మకాంను డిండికి మార్చినట్లు గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ గత జూన్‌లో మయన్మార్‌కి చెందిన ఓ వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టుచేశారు.

వ్యభిచార రొంపిలోకి మైనర్లు... పోలీసుల అదుపులో నిర్వాహకులు

Women Trafficking in Hyderabad :మయన్మార్ నుంచి రోహింగ్యాలు అసోం మీదుగా దేశంలోకి ప్రవేశించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అసోం పోలీసులు సెప్టెంబర్ 9న నమోదు చేసిన కేసును ఎన్‌ఐఏ అధికారులు స్వీకరించారు. గౌహతి, బెంగళూరు, చెన్నై, జైపూర్‌లో ఇదే తరహాలో నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక వివరాలు సేకరించి.. పలు రూపాల్లో మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు.

పలు రాష్ట్రాల్లో సోదాలు చేసి ముఠాలకు చెందిన రూ.20లక్షల నగదుతో పాటు రూ.4 వేల 550 డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి సోనాయి నది మీదుగా... కొల్‌కత్తాలోకి ప్రవేశించి అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు యువతులను తరలిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన పలు వ్యభిచార ముఠాలు.. బంగ్లాదేశ్​లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

19 నుంచి 25ఏళ్ల వయసున్న యువతులకు భారత్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిఅక్రమంగా ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఆ తర్వాత వ్యభిచారం చేయిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది. అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు పెట్టి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. మానవ అక్రమ రవాణా ప్రపంచంలోని పలు దేశాలను పట్టి పీడిస్తున్న సమస్య. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో... ఎన్ఐఏ అధికారులు రాష్ట్ర పోలీసుల సహకారంతో దాడులు చేసి నిందితులను అరెస్టు చేస్తున్నారు.

ఉద్యోగాల పేరుతో మోసం.. అశ్లీల నృత్యాలు చేయాలని!

ఒక్కడే 75 మందిని పెళ్లాడి.. 200 మంది అమ్మాయిల్ని...

ABOUT THE AUTHOR

...view details