తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ పీఎఫ్​ఐ కేసులో మరో వ్యక్తిపై ఎన్‌ఐఏ ఛార్జీ షీట్​ - మొత్తం 17​మంది నిందితులు అరెస్టు - ఎన్​ఐఏ పీఎఫ్​ఐ సంస్థ నిందితులపై ఛార్జీషీట్​

NIA Files Charge sheet on PFI Accused : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్​ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో ఛార్జ్‌ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో 17వ నిందితుడిగా ఉన్న నొస్సమ్‌ మహ్మద్‌ మూనిస్​పై హైదరాబాద్ ఎన్‌ఐఏ కోర్టులో ఛార్జ్‌ షీట్ దాఖలు అయింది. ఇప్పటి వరకు పీఎఫ్ఐ సంస్థకు సంబంధించిన 17మందిని ఎన్​ఐఏ అరెస్టు చేసింది.

NIA Files Chargesheet on PFI Accused
నిజామాబాద్​ పీఎఫ్​ఐ కేసులో మరో వ్యక్తిపై ఎన్‌ఐఏ ఛార్జీ షీట్​ - మొత్తం 17​మంది నిందితులు అరెస్టు

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 10:14 PM IST

Updated : Dec 7, 2023, 10:36 PM IST

NIA Filed Charge sheet on PFI Accused : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్​ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో ఛార్జ్‌ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో 17వ నిందితుడిగా ఉన్న నొస్సమ్‌ మహ్మద్‌ మూనిస్​పై హైదరాబాద్ ఎన్‌ఐఏ కోర్టులో ఛార్జ్‌ షీట్ దాఖలు అయింది. 2022లో నిజామాబాద్ ఆరో టౌన్ పీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఎన్ఐఏ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టింది.

ఫేక్ న్యూస్ వ్యాప్తిలో తెలంగాణ టాప్ - విద్వేషాలు రెచ్చగొట్టే ఘటనలు హైదరాబాద్‌లోనే అత్యధికం

మొత్తం ఇప్పటి వరకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) సంస్థకు సంబంధించిన 17మంది నిందితులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఇప్పటికే గతేడాది ఆగస్టులో 11మందిపై, డిసెంబర్​లో ఐదుగురుపై ఎన్‌ఐఏ అభియోగ పత్రాలు దాఖలు చేసింది. తాజాగా మరో నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభియోపత్రాలు దాఖలు చేసింది.

NIA files Chargesheet on PFI Member : 2047లోపు భారత్​ను ఇస్లాం దేశంగా మార్చాలనే లక్ష్యంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ నిందితులు పనిచేస్తున్నారని ఎన్‌ఐఏ పేర్కొంది. దేహదారుఢ్య శిక్షణ పేరుతో ముస్లిం యువతకు మారణాయుధాలతో దాడి చేయడంపై నిందితులు శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA) సోదాలు చేపట్టి నిందితులను అరెస్టు చేసింది.

NIA arrests PFI Master weapon Trainer : అలాగే గతంలో పీఎఫ్​ఐలో చేరిన వారికి ఆయుధ శిక్షణ ఇస్తున్న మహ్మద్​ యూనిస్​ అనే వ్యక్తిని ఎన్​ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్​ టూ టౌన్​ పోలీస్​ స్టేషన్​లో నమోదైన ఈ కేసుతో పాటు గత ఏడాది నుంచి ఇప్పటివరకు 16 మందిని ఎన్​ఐఏ అరెస్టు చేసింది. వీరిపై హైదరాబాద్​లోని ఎన్​ఐఏ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసింది. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు కీలక నిందితుడిని అరెస్టు చేశారు.

అమాయక ముస్లిం యువతను ప్రేరేపించి.. పీఎఫ్​ఐలో చేరిన వారికి మారణాయుధాలతో దాడులు చేయడం వంటి వాటిపై శిక్షణను ఇస్తున్నారు. అదే విధంగా భారతదేశాన్ని ఇస్లామిక్​ దేశంగా మార్చే విధంగా వారికి శిక్షణ మెలకువలు నేర్పుతుంటారు. పీఎఫ్​ఐలో చేరిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి ఆయుధాలు ఎలా వాడాలో.. తెలియజేసే ఆయుధ శిక్షకుడిగా పనిచేశాడు. ఈ పీఎఫ్​ఐ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్​ఐఏకి కీలకమైన నిందితుడు మహ్మద్​ యూనిస్​ పట్టుబడ్డాడు. నంద్యాలలో తన సోదరుడి ఇన్వర్టర్​ దుకాణంలో పని చేసిన యూనిస్​.. 2022 సెప్టెంబరులో సోదాలు చేసిన సమయంలో భార్యా పిల్లలతో పరారయ్యాడు.

PFI CASE In Telangana : ఇతని జాడ కోసం గాలిస్తున్న ఎన్​ఐఏకు.. ఆంధ్రప్రదేశ్​ నుంచి కర్ణాటకలోని బళ్లారికి పారిపోయినట్లు సమాచారం అందుకున్నారు. అక్కడ కావ్​లా బజార్​లో ఉంటూ బషీర్​ అని పేరు మార్చుకుని.. నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఉగ్రమూకలకు ప్రత్యేక కోడ్​ భాషలో సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఎన్​ఐఏ దర్యాప్తులో తేలింది.

మాజీ నక్సలైట్ నుంచి రాష్ట్ర మంత్రిగా - సీతక్క రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సంచలనాలు

రేవంత్​ రెడ్డి ప్రమాణ స్వీకారం వేళ ఎల్బీ స్టేడియానికి పోటెత్తిన జనం - డ్రోన్ విజువల్స్​ చూశారా?

Last Updated : Dec 7, 2023, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details