రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ (NHRC notice to TS Govt on students suicides) చేసింది. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై అందిన ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇచ్చింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుపై స్పందించి నివేదిక ఇవ్వాలని నెల క్రితమే ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇచ్చింది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం నోటీసులపై స్పందించలేదు.
NHRC Notice: విద్యార్థుల ఆత్మహత్యలపై.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు - NHRC notice to telangana govt
విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు (NHRC notice to telangana govt) జారీ చేసింది. తెలంగాణలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదు మేరకు... ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.
NHRC Notice
దీంతో మరోసారి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం.. ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని(NHRC notice to telangana government) ఆదేశించింది. నివేదిక ఇవ్వకపోతే చట్టబద్ధంగా తీసుకునే చర్యలకు సిద్ధం కావాలని హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వానికి సైతం ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి:Snake in Car Adilabad : కారులో పాము కలకలం.. 50 కిలోమీటర్లు సర్పంతోనే ప్రయాణం