తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖ ఘటనపై ఏపీ ప్రభుత్వానికి ఎన్​హెచ్ఆర్సీ నోటీసులు - nhrc latest news

ఏపీలోని విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

Breaking News

By

Published : May 7, 2020, 5:48 PM IST

ఏపీలోని విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం.. మానవ తప్పిదం కారణంగానో, నిర్లక్ష్యంతో ఘటన జరిగినట్లు రుజువు కాకపోయినా... అమాయక ప్రజల ప్రాణాలు పోయాయని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

ఒకవైపు కరోనా ప్రభావంతో దేశంలో ప్రజల ప్రాణాలు ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం అని మానవహక్కుల సంఘం అభిప్రాయపడింది. పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టి నివేదిక అందజేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించి.. నియమ నిబంధనలు ఉల్లంఘన, సంబంధిత వ్యవహారాలపై నివేదిక ఇవ్వాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి కూడా ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసింది ఎన్​హెచ్ఆర్సీ.

ఇవీచూడండి:మందు భామలం మేము.. క్యూ కడతాము..!

ABOUT THE AUTHOR

...view details