తెలంగాణ

telangana

ETV Bharat / state

వరవరరావు వైద్య నివేదికలు పరిశీలిస్తాం: ఎన్‌హెచ్‌ఆర్సీ - వరవరరావు వైద్య నివేదికలు ప్యానెల్‌ వైద్య నిపుణులతో పరిశీలన

ప్రముఖ రచయిత వరవరరావు వైద్య నివేదికలను ప్యానెల్‌ వైద్య నిపుణులతో పరిశీలించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నిర్ణయించింది. మహారాష్ట్రలో కరోనా ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్ణయం సహేతుకమైనదిగా పేర్కొంది.

nhrc experts to examine the varavara rao medical reports
వరవరరావు వైద్య నివేదికలు పరిశీలిస్తాం: ఎన్‌హెచ్‌ఆర్సీ

By

Published : Aug 22, 2020, 7:21 AM IST

మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న విరసం నాయకులు వరవరరావు వైద్య నివేదికలను ప్యానెల్‌ వైద్య నిపుణులతో పరిశీలించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నిర్ణయించింది. ఎన్‌హెచ్‌ఆర్సీ ఇచ్చిన నోటీసులకు ప్రతిస్పందనగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన వైద్య నివేదికలు పంపగా కమిషన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

నిపుణుల ప్యానెల్‌ రెండు వారాల్లో కమిషన్‌ పరిశీలనకు నివేదిక ఇవ్వాలని కోరింది. మహారాష్ట్రలో కరోనా ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్ణయం సహేతుకమైనది, ఆమోదయోగ్యమైనదిగా పేర్కొంది.

ఇదీ చూడండి:పురపాలక శాఖలో 2,298 కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం

ABOUT THE AUTHOR

...view details