కొవిడ్ సమయంలో సేవలందించిన తమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి.. పీఆర్సీ వర్తింపజేయాలని నేషనల్ హెల్త్ మిషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు ధర్నా నిర్వహించారు. కేవలం చప్పట్లు, హెలికాఫ్టర్లలో పువ్వులు చల్లితే తమ కడుపులు నిండవని... వేతనాలు పెంచితేనే సంతోషిస్తామన్నారు. హైదరాబాద్లోని కోఠి వైద్య సంచాలకుల కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎమ్ ఉద్యోగులు ప్రభుత్వం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఆర్సీ ఇవ్వాలంటూ ఎన్హెచ్ఎమ్ ఉద్యోగుల ఆందోళన - నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని వర్తింపజేయాలని నేషనల్ హెల్త్ మిషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు ఆందోళన చేశారు. కరోనా సమయంలో సేవలందించిన తమను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని కోఠి వైద్య సంచాలకుల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
పీఆర్సీపై ఎన్హెచ్ఎమ్ ఉద్యోగుల ఆందోళన
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కంటి వెలుగు, బస్తీ దవాఖాన, డయాగ్నోసిస్ కేంద్రాలలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రవణ్ తెలిపారు. కరోనా సమయంలో ముందుండి సేవలందించినా.. పీఆర్సీ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 15 వేల మంది ఉద్యోగులకు అన్యాయం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే తమకు పీఆర్సీ అమలుచేసి.. వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.