తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ రహదారులపై అభివృద్ధి పనులు ప్రారంభం - nhai started road works on highways

లాక్​డౌన్​ కారణంగా రోడ్లపైకి కేవలం రవాణా వాహనాలు వస్తుండగా రహదారులపై రద్దీ బాగా తగ్గింది. ఇదే అదనుగా ఎన్​హెచ్ఏఐ అధికారులు జాతీయ రహదారులపై అభివృద్ధి పనులు చేపట్టారు. మరిన్ని పనులు వీలైనంత త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రాంతీయ అధికారి వెల్లడించారు.

nhai started road works on highways in telangana state
జాతీయ రహదారులపై అభివృద్ధి పనులు ప్రారంభం

By

Published : Apr 21, 2020, 5:38 PM IST

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించగా కేవలం రవాణా వాహనాలు మాత్రమే రోడ్డు మీదకు వస్తున్నాయి. ప్రయాణికుల వాహనాలు దాదాపుగా ఇళ్లకే పరిమితమయ్యాయి. రహదారులపైనా వాహనాల రద్దీ తగ్గిపోగా ఎన్​హెచ్ఏఐ అధికారులు జాతీయ రహదారులపై అభివృద్ధి పనులు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 5,600 కోట్ల విలువైన రహదారుల నిర్మాణం చేపట్టారు.

ఊరు కి.మీ పనుల విలువ
కంది నుంచి రాంసాన్ 39.98 రూ. వేయి కోట్ల
రాంసాన్​ నుంచి మంగ్లూర్ 46.81 రూ.1,234 కోట్లు
మంగ్లూర్​ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు 48.96 రూ.936 కోట్ల
వరంగల్​ రూట్ 99.101 రూ. 1,905 కోట్లు
సూర్యాపేట నుంచి ఖమ్మం 58.62 రూ. 1,566 కోట్లు

మరికొన్ని పనులు వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని ​హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details