ఆ క్వారీల్లో మైనింగ్ ఆపాలని ఎన్జీటీ ఆదేశం
18:44 May 11
ఆ క్వారీల్లో మైనింగ్ ఆపాలని ఎన్జీటీ ఆదేశం
NGT on Illegal Mining: పర్యావరణ అనుమతులు లేని క్వారీల్లో మైనింగ్ ఆపాలని ఎన్జీటీ ఆదేశించింది. తెలంగాణలో స్టోన్ క్వారీలకు పర్యావరణ అనుమతులపై ఇవాళ ఎన్జీటీ విచారణ చేపట్టింది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలపై చర్యలు తీసుకోని అధికారులపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేని క్వారీలను కొనసాగిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఎన్జీటీ.. అక్రమ మైనింగ్‌పై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది.
పర్యావరణ అనుమతులు లేని క్వారీల్లో మైనింగ్‌కు వీల్లేదని ఎన్జీటీ స్పష్టం చేసింది. పి.ఇందిరారెడ్డి, ఎ.నిఖిల్‌రెడ్డి పిటిషన్లపై సంయుక్త కమిటీ ఇచ్చిన నివేదికపై విచారణ చేపట్టింది. రంగారెడ్డి జిల్లా బండారావిరాల, దేశముఖి మండలాల్లో అక్రమ మైనింగ్, కంకర, తారు మిక్సింగ్ ప్లాంట్ల వల్ల పర్యావరణ సమస్యలు వస్తున్నాయని వెల్లడించింది. అక్రమ మైనింగ్‌పై తీసుకున్న చర్యలను సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణను ఎన్జీటీ చెన్నై బెంచ్ ఈనెల 17కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: