తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్‌జీటీలో విచారణ - కేంద్ర జలశక్తిశాఖ

ngt-inquiry-in-on-petition-filed-on-kaleshwaram-expansion-works
కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్‌జీటీలో విచారణ

By

Published : Oct 1, 2020, 4:21 PM IST

Updated : Oct 1, 2020, 5:32 PM IST

16:19 October 01

కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్‌జీటీలో విచారణ

కాళేశ్వరం విస్తరణ పనులపై వేసిన పిటిషన్‌పై ఎన్‌జీటీలో విచారణ జరుగనుంది. పర్యావరణ అనుమతులు లేవని వేములఘాటు రైతులు పిటిషన్ వేశారు. ఈ మేరకు కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్‌జీటీ కేంద్ర జలశక్తిశాఖ అభిప్రాయంను కోరింది. జలశక్తి శాఖ రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపింది. పిటిషన్‌పై నవంబరులో విచారణ చేయాలని ఎన్‌జీటీ నిర్ణయం తీసుకుంది. త్వరగా విచారించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోరారు.

ప్రభుత్వం రికార్డుస్థాయిలో కాళేశ్వరం పనులు పూర్తి చేసిందని న్యాయవాది అన్నారు. గడువు ఇస్తే పనులు పూర్తయ్యే అవకాశం ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. త్వరగా విచారించేందుకు జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్ ధర్మాసనం అంగీకారం తెలిపింది. కాళేశ్వరంపై వేసిన అన్ని పిటిషన్లను ఈనెల 7న విచారిస్తామని ఎన్‌జీటీ వెల్లడించింది.

ఇదీ చూడండి :నర్సాపూర్ లంచం కేసులో నిందితులకు బెయిల్ తిరస్కరణ

Last Updated : Oct 1, 2020, 5:32 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details