తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు - హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా వార్తలు

ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

next three days rains in telugu states
తెలుగు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు

By

Published : May 31, 2020, 3:56 PM IST

ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ కారణంగా రాగల 24 గంటల్లో వాయుగుండముగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం రాగల 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని, జూన్ 3 నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు చేరే అవకాశం ఉందని ప్రకటించింది.

ఈదురుగాలులతో కూడిన..

ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ మధ్య కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఉంటుదని సమాచారం. నైరుతి రుతుపవనాలు రేపు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడొచ్చని, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు

ఇదీ చూడండి :ప్రత్యేక రైళ్లలో వేళ్లేవారు ఆ సూచనలు పాటించాలి

ABOUT THE AUTHOR

...view details