ఈనెల 31తో ఏపీ ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం ముగియనుంది. ఆయన స్థానంలో ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌గా సీఎం ముఖ్య సలహాదారు, మాజీ సీఎస్ నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమె పేరును ఆమోదించారు. ఈనెల 31తో ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎస్‌ఈసీ ఎంపిక కోసం ముగ్గురు విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లతో కూడిన దస్త్రాన్ని ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. వీరిలో నీలం సాహ్ని నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆమె ఏప్రిల్ 1న ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఏపీ నూతన ఎస్‌ఈసీగా నీలం సాహ్ని - ఏపీ ఎస్‌ఈసీ
ఏపీ నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా సీఎం ముఖ్య సలహాదారు, మాజీ సీఎస్ నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమె పేరును ఆమోదించారు.
ap new sec, neelam sahne, ap sec
త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా తగు చర్యలు తీసుకోనున్నారు.