డిజిటల్ తరగతుల కోసం.. గ్యాడ్జెట్స్ కొనలేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు, తక్కువ ఇంటర్నెట్ స్పీడ్‌తో ఆన్లైన్ క్లాసులు వినలేకపోతున్న విద్యార్థులకు క్లాస్రూమ్ టీవీ మంచి ప్రత్యామ్నయం అన్నారు కంపెనీ ఛైర్మన్ శ్రీకుమార్. 8, 9, 10వ తరగతుల విద్యార్థులు రూ.999 సంవత్సర చందా కట్టి ఆయా తరగతులకు సంబంధించిన పాఠాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో టీవీలోనే వినొచ్చని ఆయన తెలిపారు. నెక్స్ట్ డిజిటల్‌తో పాటు.. ఇతర ఎంఎస్‌వోలు, కేబుల్టీవీల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఇంట్లోని టీవీల్లోనే డిజిటల్ క్లాసులు వినొచ్చన్నారు. టీవీతో పాటు యాప్, వైబ్సైట్లో కూడా పాఠాలు వినే సౌకర్యం ఉందని ఆయన పేర్కొన్నారు.
నాణ్యమైన డిజిటల్ తరగతుల కోసం.. క్లాస్రూమ్ టీవీ ఆవిష్కరణ!
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల పాఠశాలలు ప్రారంభం కాక.. ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం పాఠశాలలకు సూచించింది. అయితే.. ఇంటర్నెట్ సౌకర్యం లేక, సిగ్నల్స్ సరిగ్గా లేక ఆన్లైన్ తరగతులు వినడంలో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకు నెక్స్ట్ డిజిటల్ ముందుకొచ్చింది. క్లాస్రూమ్ టీవీతో నాణ్యమైన డిజిటల్ క్లాసులు వినేలా సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఇంట్లోని టీవీలోనే.. హెచ్డీ క్వాలిటీతో పాఠాలు వినే క్లాస్రూమ్ టీవీని ప్రారంభించింది.
నాణ్యమైన డిజిటల్ తరగతుల కోసం.. క్లాస్రూమ్ టీవీ ఆవిష్కరణ!
టీవీ మాధ్యమం ద్వారా డిజిటల్ తరగతులు బోధించే తమ ఫ్యాకల్టీ.. కార్పొరేట్ పాఠశాలల స్థాయి క్వాలిటీ విద్యను విద్యార్థులకు అందిస్తారని.. స్టేట్, సెంట్రల్ సిలబస్‌ను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తారని కంపెనీ సీఓఓ సుభోదీప్ అన్నారు. 24గంటలు నడిచే ఈ ఛానల్ ద్వారా పిల్లలు అర్థం కాని తరగతులను మళ్లీ మళ్లీ వినవచ్చని, రివిజన్ చేసుకోవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి :ఇళ్ల సందర్శనను అర్ధాంతరంగా నిలిపివేసిన కాంగ్రెస్