తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తజంటకు క్వారంటైన్ ముద్ర - క్వారంటైన్ ముద్ర

విజయవాడలో పెళ్లి చేసుకుని హైదరాబాద్​కు వస్తున్న నూతన వధూవరులకు అధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. హోమ్​ క్వారంటైన్​లోనే ఉండాలంటూ సూచించి... ముద్ర వేసి పంపించారు.

newly-married-couple-got-quarantine-stamp-in-suryapet
కొత్తజంటకు క్వారంటైన్ ముద్ర

By

Published : May 11, 2020, 3:19 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏపీ నుంచి వచ్చిన వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో వివాహం చేసుకొని... హైదరాబాద్​కు వెళ్తున్న నూతన వధూవరులకు చెక్​పోస్టు వద్ద ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

హోమ్ క్వారంటైన్ ముద్రవేసి... శుభాకాంక్షలు తెలిపారు. మాస్కులు,శానిటైజర్లును అందించి... స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.

ఇవీ చూడండి:సంప్రదాయాలే మనకు రక్ష: గవర్నర్​

ABOUT THE AUTHOR

...view details