తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊపిరి అందట్లేదు.. నా భార్య జాగ్రత్త! - కరోనా మృతుల సంఖ్య

అయిదు నెలల క్రితమే మేనమామ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మూడు నెలల వ్యవధిలో ద్విచక్ర వాహనాల వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం తన చెల్లికి వివాహం జరిపించేందుకు సంబంధాలు చూస్తున్నాడు. ఇంతలోనే అతడిని కరోనా మహమ్మారి కాటేసింది.

newly-married-bridegroom-died-with-corona-at-hyderabad
ఊపిరి అందట్లేదు.. నా భార్య జాగ్రత్త!

By

Published : May 6, 2021, 7:58 AM IST

హైదరాబాద్‌లోని మల్లాపూర్‌ డివిజన్‌లో దినకర్‌యాదవ్‌(28) కుటుంబంతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. వారం రోజుల క్రితం తన భార్యతో కలిసి ఎల్బీనగర్‌లోని అత్తారింటికి వెళ్లాడు. మరుసటి రోజు నుంచి జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు ఎక్కువ కావడంతో నిర్ధరణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సూచన మేరకు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు.

ఆదివారం సాయంత్రం ఆయాసంతోపాటు దగ్గు తీవ్రమవడంతో ఆక్సిమీటర్‌తో పరీక్షించుకోగా ప్రాణవాయువు శాతం క్రమంగా పడిపోతున్నట్లు గుర్తించాడు. సోమవారం ఉదయం కుటుంబీకులు కర్మాన్‌ఘాట్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులతోనూ దినకర్‌యాదవ్‌ చరవాణిలో మాట్లాడాడు. ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని, తన భార్యను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులను కోరాడు. అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లయిన అయిదు నెలలకే భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.

ఇదీ చూడండి:గర్భిణీల్లో ధైర్యం నింపుతోన్న వైద్యులు

ABOUT THE AUTHOR

...view details