పెట్రోల్ హెచ్చు, తగ్గుదల కారణంగా ఎలక్ట్రిక్ వాహనల వినియోగం పెరుగుతుందని కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి పద్మనాభయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓహెచ్‌ఎం, ఓఎస్‌ఎం సంస్థలు కొత్తగా రూపొందించిన ఎలక్ట్రిక్ కార్గో ఆటోను ఆయన మార్కెట్‌లోకి విడుదల చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అస్కిలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మనాభయ్యతోపాటు ఓఎస్‌ఎం ఛైర్మన్ ఉదయ్ నారంగ్, ఓఎస్‌ఎం ఎండీ ముఖర్జీ, ఓహెచ్‌ఎం సీఈఓ నిర్మల్‌రెడ్డి సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీని ప్రకటించిన మరునాడే ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్‌లోకి రావడం చాలా ఆనందంగా ఉందని పద్మనాభయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభిరుచులకు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ ఆటోను రూపొందించారని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనల వల్ల కాలుష్యం తగ్గుతుందన్నారు.