తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు, ఒకరు మృతి

ఏపీలో కొత్తగా 319 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,84,490కు చేరింది. కొత్తగా 410 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,423 మంది చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో కొత్తగా 319 కరోనా కేసులు, ఒకరు మృతి
రాష్ట్రంలో కొత్తగా 319 కరోనా కేసులు, ఒకరు మృతి

By

Published : Jan 8, 2021, 7:57 PM IST

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా 46, గుంటూరు 39, అనంతపురం 22, చిత్తూరు 44, తూర్పుగోదావరి 26, కడప 14, కర్నూలు 26, నెల్లూరు 23, ప్రకాశం 10, శ్రీకాకుళం 12, విశాఖ 25, విజయనగరం 5, పశ్చిమగోదావరి జిల్లాలో 27 మందికి వైరస్​ సోకినట్టుగా అధికారులు తెలిపారు.

ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 84 వేల490కు చేరింది. ఇప్పటివరకు 7,127 మంది మహమ్మారికి బలయ్యారు. కొత్తగా 308 మంది కోలుకోగా.. ప్రస్తుతం 2,832 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు.

ఇదీ చదవండి:రాష్ట్రాభివృద్ధిలో సాంకేతికత ప్రధానమైనది : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details