రాష్ట్రంలో కొత్తగా 1,417 కరోనా కేసులు, 13 మరణాలు - తెలంగాణలో కరోనా కేసులు

09:19 September 14
రాష్ట్రంలో కొత్తగా 1,417 కరోనా కేసులు, 13 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 1,417 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,58,513కు చేరాయి. కొవిడ్‌తో మరో 13 మంది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 974కు పెరిగాయి. వైరస్ నుంచి కోలుకుని మరో 2,479 మంది డిశ్చార్జయ్యారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,27,007కు చేరింది. ప్రస్తుతం 30,532 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్‌లో 23,639 మంది బాధితులు ఉన్నారు.
ఇదీ చూడండి :శ్రావణి కేసు: దేవరాజ్‌రెడ్డి పెళ్లి నిరాకరించినందుకే ఆత్మహత్య!