తెలంగాణలో రికార్డుస్థాయి కేసులు.. ఒక్కరోజే 4,446 మందికి పాజిటివ్
09:27 April 17
రాష్ట్రంలో మరో 4,446 కరోనా కేసులు, 12 మరణాలు
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. రికార్డుస్థాయిలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో మరో 4వేల 446 కొవిడ్ కేసులు వెలుగు చూడగా... 12 మరణాలు సంభవించాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 33,514కు చేరింది.
ఇవాళ మరో 1,414 మంది వైరస్ బారినుంచి కోలుకోగా... 22,118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నిన్న లక్షా 26 వేల 235 మందికి నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా 21 నుంచి 40 సంవత్సరాల వయసు వారికి వైరస్ అధికంగా నిర్ధరణ అవుతున్నట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 598 మందికి వైరస్ సోకింది. మేడ్చల్ జిల్లాలో 435, రంగారెడ్డి 326, నిజామాబాద్314, సంగారెడ్డి 235, కామారెడ్డి 184, జగిత్యాల 180, నల్గొండ 168, నిర్మల్ 160, కరీంనగర్ 149, ఖమ్మం జిల్లాలో 148 కొత్త కేసులు బయటపడ్డాయి.