నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు మిఠాయిలకు బదులుగా... చిరు ధాన్యాలు ఇచ్చేందుకు ఏపీలోని కర్నూలు జిల్లాలో మార్క్‌ఫెడ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. న్యూట్రీ బాస్కెట్ పేరుతో ఆరు రకాల చిరుధాన్యాలను అమ్మకానికి అందుబాటులో ఉంచారు.
చిరు ధాన్యాలతో... నూతన సంవత్సర శుభాకాంక్షలు! - new year wishes news
మిఠాయిలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ చెప్తారు... కానీ వీరు మాత్రం కొంచెం వినూత్నంగా... మరి కొంచెం ఆరోగ్య శ్రద్ధతో ఆలోచించారు... ఆరోగ్యాన్ని కిట్ల రూపంలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విశేషం ఏంటో మీరూ తెలుసుకోండి.

చిరు ధాన్యాలతో... నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈ కిట్లలో కొర్ర, అండు కొర్ర, అరక, వరిగ, సామలు, ఊదలు తదితర రకాలు ఉంటాయి. ఒక్కొక్కటి 250 గ్రాముల చొప్పున.. మెుత్తం ఒకటిన్నర కిలోల మేర ఉండే... ఈ కిట్‌ను 270 రూపాయలకు విక్రయిస్తున్నారు. శుభాకాంక్షలతో పాటు.. ఆత్మీయులకు ఆరోగ్యాన్ని అందించాలని ఉంటే ఏపీ మార్క్‌ఫెడ్ వారిని సంప్రదించండి!
ఇదీ చదవండి:'లక్ష్యాలు పెట్టుకోండి... ప్రణాళికలు సిద్ధం చేసుకోండి'