2019లో జరిగిన ఘటనలు 2020లో తిరిగి పునరావృతం కాకూడదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లి పోలీసు స్టేషన్‌లో బంధించారని ఆరోపించారు. ఆయన ఏమైనా ఉగ్రవాదా లేక తీవ్రవాదా అని నిలదీశారు. హాజీపూర్‌లో ముగ్గురు అమ్మాయిలను పొట్టన పెట్టుకున్న నిందితుడు శ్రీనివాస రెడ్డికి ఎలాంటి శిక్షపడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు 2020లో జరగకూడదని ఆయన కోరుకున్నారు.
'2019లో జరిగన తప్పులు ఈ ఏడాదిలో పునరావృతం కాకూడదు' - నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సరం సందర్భంగా గత సంవత్సరంలో జరిగిన పొరపాటులు, ఘటనలకు తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు.
'2019లో జరిగన తప్పులు ఈ ఏడాదిలో పునరావృతం కాకూడదు'
భారత దేశంలో ఉన్న 130 కోట్లు మంది హిందువులే ఉన్నారని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశానని హనుమంతురావు చెప్పారు. భారతదేశం ఒక లౌకిక దేశమని.. కేవలం హిందువులే కాదని అన్ని మతాల వారు ఇక్కడ ఉన్నారని అన్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా న్యాయ పరిశీలనకు పంపించామని చెప్పడంలో అర్థం లేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పోలీసులు స్ట్రిక్ట్.. ఈసారి తగ్గిన ఈవెంట్ల జోష్...