New Year Resolutions 2024 : న్యూ ఇయర్లో అడుగుపెట్టబోతున్నామనే ఆలోచనే, కుర్రకారు నుంచి వృద్ధుల దాకా నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. వారం పది రోజుల ముందు నుంచే నూతన సంవత్సరం (New Year 2024) సెలబ్రేషన్స్ ఏర్పాట్లతో పాటు. వచ్చే ఏడాదిలో ప్రారంభించాల్సిన పనుల గురించి తమ లక్ష్యాల గురించి ప్లాన్లు వేసుకుంటారు. వీటినే రిజల్యూషన్స్ అంటారు. ఈ సంస్కృతి పాశ్చాత దేశాల నుంచి ఆసియా దేశాలకు వ్యాప్తి చెందింది.
న్యూ ఇయర్ రోజు పార్టీ చేసుకుంటున్నారా - అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
జీవితంలో ఏదైనా ఒక ప్రత్యేక మార్పు : మంచి ఏదైనా సరే, ఎక్కడున్నా సరే స్వీకరిస్తే తప్పేం లేదని చాలా మంది అనుసరిస్తున్నారు కూడా. మనలో ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న జీవితంలో ఏదైనా ఒక ప్రత్యేక మార్పు చేయాలనుకుంటే, ఓ ప్రత్యేక రోజు కోసం వెతుకుతారు. ఆ రోజు నుంచి మార్పు దిశగా ప్రయాణం సాగిస్తారు. ఎక్కువ మంది పుట్టిన రోజు, పెళ్లి రోజు లేదంటే ఏదైనా పండగను అందుకు గుర్తుగా పెట్టుకుంటారు.
"2024 సంవత్సరంలో మూడు నాలుగు నెలల్లోగా ఏదైనా ఒక ఉద్యోగంలో చేరాలని రిజల్యూషన్ పెట్టుకున్నాను. జాబ్ చేయడం లేదని ఏదో ఓ లోటు ఉంది. కొన్ని రోజులలో దాన్ని సాధించాలని లక్ష్యం పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం ఏవో కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాను. కొత్త సంవత్సరంలో జాబ్ సాధించాలని గోల్ పెట్టుకున్నా పుడ్, యోగా మొదలైన అంశాలపై కొత్త ఏడాదిలో పట్టు సాధించాడానికి ప్రయత్నిస్తాను." - ఓ విద్యార్థి
మార్పుకై రిజల్యూషన్స్ : న్యూ ఇయర్ కూడా అలాంటిదే ఇది, ఆంగ్ల సంవత్సరాది కాబట్టి ఆ రోజు నుంచి కొత్త నిర్ణయాలు అమలు చేయాలని చాలా మంది భావిస్తారు. గతేడాది ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకుని అమలు చేయడం ఆరంభిస్తారు. కొత్త సంవత్సరంలో తొలిరోజు సంతోషంగా ఉంటే మిగతా రోజులంతా అలాగే ఉంటామనేది ఓ మానసిక భావన. ఆ రోజు కొత్త రిజల్యూషన్స్ను ప్రారంభిస్తే కచ్చితంగా సాధిస్తామని జీవితంలో పెను మార్పులకు ఇది కారణం అవుతుందని చాలా మంది నమ్మకం.