New Year Celebrations Restrictions in Hyderabad 2024 :త్వరలోనే నూతన ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈసారి న్యూయర్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతుంది. ఇంతలోనే నగర పోలీసులు న్యూయర్(New Year) ఆంక్షలు అంటూ ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని చెప్పారు. వేడుకలు నిర్వహించే బహిరంగ ప్రదేశాలు, రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు రాత్రి 1 గంట వరకు మూసివేయాలని తెలిపారు. న్యూయర్ సంబురాలను(New Year Celebrations 2024) నిర్వహించాలనే నిర్వాహకులు పది రోజుల ముందుగానే అనుమతులు తీసుకోవాలని సూచించారు.
ప్రతీ ఈవెంట్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని నగర పోలీసులు(New Year Restrictions) ఆదేశించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉండకూడదని తెలిపారు. వేడుకల్లో కెపాసిటీని మించి పాసులు ఇవ్వొద్దని నిర్వాహకులను హెచ్చరించారు. వేడుకల్లో పాల్గొనే వారికి పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు.
New Year Celebrations 2024 in Hyderabad : లిక్కర్ వినియోగించే వేడుకల్లో మైనర్లకు అనుమతి లేదన్నారు. అలా మైనర్లను అనుమతిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నూతన ఏడాది వేడుకల్లో పాల్గొనే వారు డ్రగ్స్(Drugs) వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష పడుతుందని అన్నారు. మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని హెచ్చరించారు.