సైబరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సైబర్ టవర్స్ వద్ద సీపీ సజ్జనార్, పోలీసు సిబ్బంది ప్రజలతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. సతీ సమేతంగా కేక్ కట్ చేసిన సజ్జనార్‌కు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి స్వీయ చిత్రాలు దిగడానికి కొంత మంది పోటీపడ్డారు.
సైబర్ టవర్స్ వద్ద సీపీ సజ్జనార్ నూతన సంవత్సర వేడుకలు - సీపీ సజ్జనార్ నూతన సంవత్సర వేడుకలు తాజా వార్త
హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలను సీపీ సజ్జనార్, పలువురు పోలీస్ సిబ్బంది ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించారు.
సైబర్ టవర్స్ వద్ద సీపీ సజ్జనార్ ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
కమిషనరేట్‌లోని వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. సైబర్ టవర్స్ సమీపంలో స్వల్ప రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొనడంతో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి : నుమాయిష్‌కు హైకోర్టు పచ్చజెండా
Last Updated : Jan 1, 2020, 7:41 AM IST